క్యాన్స‌ర్‌ను జ‌యించాను: స‌ంజ‌య్ ద‌త్‌

21 Oct, 2020 17:19 IST|Sakshi

శ్వాస తీసుకోవ‌డం ఇబ్బంది అవుతోంద‌ని బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ఇటీవ‌ల ఆస్ప‌త్రికి వెళ్లారు. తీరా వైద్య ప‌రీక్ష‌ల్లో ఊపిరితిత్తుల‌ క్యాన్సర్ అని తేల‌డంతో ఆయ‌న అభిమానులు షాక్‌కు గుర‌య్యారు. ఆయ‌న‌ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్థించారు. తాజాగా వారంద‌రికీ సంజ‌య్ శుభ‌వార్త చెప్పారు. క్యాన్స‌ర్‌ను జ‌యించిన‌ట్లు బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఓ లేఖ‌ను పంచుకున్నారు. త‌న సంపూర్ణ ఆరోగ్య‌మే పిల్ల‌ల బ‌ర్త్‌డేకు ఇస్తున్న పెద్ద గిఫ్ట్ అని చెప్పుకొచ్చారు.(చ‌ద‌వండి: సంజ‌య్ ద‌త్ ఆరు చిత్రాలు.. 750 కోట్లు)

"గ‌డిచిన‌‌ కొన్నివారాలు నాకు, నా కుటుంబానికి అత్యంత క్లిష్ట‌మైన రోజులు. అయితే బ‌ల‌మైన వాళ్ల‌కే దేవుడు పెద్ద‌పెద్ద‌ క‌ష్టాలిస్తాడ‌ని వారు చెప్తూ ఉండేవారు ఈ రోజు నా పిల్ల‌ల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మీ అంద‌రికీ ఓ ముఖ్య విష‌యం చెప్తున్నాను. నేను క్యాన్స‌ర్ నుంచి కోలుకున్నాను. నా ఆరోగ్య‌మే వారికి నేనిచ్చే పెద్ద బ‌హుమ‌తి. మీ అంద‌రి ప్రేమాభిమానాలు లేక‌పోతే ఈ గెలుపు సాధ్య‌మ‌య్యేదే కాదు. నా కోసం ప్రార్థిస్తూ అండ‌గా నిల‌బ‌డ్డ‌ ప్ర‌తి ఒక్క‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు. కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో నాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ చికిత్స అందించిన డాక్ట‌ర్ సేవంతి, ఆమె టీమ్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు" అని రాసుకొచ్చారు. ఇక ఈ వార్త విన్న ఆయ‌న‌ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా వుండ‌గా సంజ‌య్ చేతిలో ఆరు సినిమాలు ఉండ‌గా, ప్ర‌స్తుతం కేజీఎఫ్: చాప్ట‌ర్ 2 లో అధీరా పాత్ర‌లో న‌టిస్తున్నారు. (చ‌ద‌వండి: 25 ఏళ్ల దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు