రాయే నువ్వు రాయే..

20 Oct, 2020 03:50 IST|Sakshi

నందు విజయ్‌ కృష్ణ, రష్మీ గౌతమ్‌ జంటగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. రాజ్‌ విరాట్‌ దర్శకత్వంలో విజయీభవ ఆర్ట్స్‌ పతాకంపై ప్రవీణ్‌ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్‌ రెడ్డి మద్ది, మనోహర్‌ రెడ్డి యెడ నిర్మించారు. ‘రాయే నువ్వు రాయే’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని హీరో వరుణ్‌ తేజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా సినిమా టైటిల్, టీజర్‌కి అటు ప్రేక్షకుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ అభిమానిగా నందు నటించాడు. నందు పాత్రకు సమానంగా రష్మి పాత్ర కూడా ఉంటుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాతా సిద్ధార్థ్, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు