‘బొమ్మల కొలువు’ ట్రైలర్ విడుదల

10 Aug, 2021 21:29 IST|Sakshi

‘రఘువరన్ బి.టెక్‌’తో సినీ రంగ ప్రవేశం చేసిన మ్యూజిక్ కంపోజర్ అనిరుద్‌ రవిచంద్రన్ తమ్ముడు రిషికేశ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రిషికేశ్‌, ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వంలో పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్ పతాకాల‌పై ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మ‌ల కొలువు’. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి కోన వెంక‌ట్, బి.వి.ఎస్‌.ర‌వి ముఖ్య అతిథులుగా హాజ‌రై ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...హీరో రిషికేశ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుబ్బుగారు డిఫరెంట్‌గా తెర‌కెక్కించారు. నాపై న‌మ్మ‌కంతో రుద్ర అనే పాత్ర‌ను నాకు ఇచ్చారు. అలాగే నిర్మాత స్వామిగారికి స్పెష‌ల్ థాంక్స్‌. సినిమాలంటే ఉండే ప్యాష‌న్‌తో సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు