Bommarillu Movie: ‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్ర నా నిజ జీవితంలోనిది

23 Aug, 2021 19:13 IST|Sakshi

‘బొమ్మరిల్లు’.. ఈ సినిమా పేరు వినగానే మొదట గుర్తొచ్చే పాత్ర ఏంటంటే హా.. హా.. హాసిని. అంతగా ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తం హీరోయిన్‌ చూట్లూ తిరిగే ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బొమ్మరిల్లు హిట్‌తో డైరెక్టర్‌ భాస్కర్‌ పేరు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌గా మారింది. అంత పెద్ద విజయం సాధించిన ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలను డైరెక్టర్‌ భాస్కర్‌ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. సినిమా సక్సెస్‌లో కీ రోల్‌ పోషించిన హాసిని పాత్రను ఎలా క్రియేట్‌ చేశారన్నది ఈ సందర్భంగా వివరించాడు. 

చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్‌ మీద ఒట్టు!: వర్మ

ఆయన మాట్లాడుతూ.. తన నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా హాసిని పాత్రను  తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ‘ఆర్య సినిమాకు పని చేస్తున్న సమయంలో ఈ మూవీ హిట్‌ అయితే నాతో ఓ సినిమా చేస్తానని రాజు గారు(‘దిల్‌’ రాజు) మాట ఇచ్చారు. మంచి కథ సిద్దం చేసి తనని కలవమని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆర్య హిట్‌ అయ్యింది. దీంతో ఆయనకు రెండు సార్లు స్క్రిప్ట్‌లు వివరించాను. అవి ఆయనకు నచ్చలేదు. మూడోసారి బొమ్మరిల్లు కథతో వెళ్లాను. ఈ కథ నచ్చింది కానీ, హీరోయిన్‌ పాత్ర అంతగా లేదు, దాని మీద మరింత వర్క్‌ చేసి రమ్మన్నారు. దీనికి నేను 15 రోజులు గడువు అడిగాను. హీరోయిన్‌ పాత్ర ఎలా తీర్చిదిద్దాలని నేను, వాసు వర్మ తెగ ఆలోచించాం. కానీ సరైన లైన్‌ తట్టట్లేదు. ఇలా 14 రోజులు గడిచాయి. చిరాకు వస్తుంది. 15వ రోజు వచ్చేసింది. రాత్రంతా నిద్ర లేదు’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్‌ అనుమానాస్పద మృతి..

ఇక ‘ఆ రోజు రాత్రి నేను, వాసు చర్చించుకుంటూనే ఉన్నాం. మాటల మధ్యలో నా జీవితంలో జరిగిన సంఘటనను ఆయనకు చెప్పాను.  ఒకమ్మాయిని అనుకోకుండా గుద్ది సారీ చెబితే.. తనొచ్చి ఒకసారి గుద్ది వెళ్లిపోతే కొమ్ములు వస్తాయని మరోసారి ఢీకొట్టి వెళ్లిందని చెప్పాను. అది బాగుందని వాసు అనడంతో ఆ సీన్ రాశాం. ఇక దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పాత్రను తీర్చిదిద్దాం. మరుసటి రోజు సాయంత్రం వెళ్లి రాజు గారికి ఈ క్యారెక్టర్ గురించి చెబితే భలే ఉంది అన్నారు. దీంతో ఈ పాత్రకు ఏ హీరోయిన్‌ కావాలని అడిగారు. జెనీలియాను తీసుకుందామని చెప్పాను. అలా హాసిని పాత్రను చాలా కష్టపడి క్రియేట్‌ చేశాం’ అని వివరించాడు. కాగా 9 ఆగష్టు 2006 విడుదలైన ఈ చిత్రంలో హీరోగా సిద్దార్థ్‌ నటించాడు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధలు ప్రధాన పాత్రలు పోషించారు.

చదవండి: ఫుట్‌బోర్డ్‌పై సమంత, నయన్‌, విజయ్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు