Boney Kapoor: బోనీ కపూర్ నుంచి లక్షల్లో చోరీ.. పోయినట్టు కూడా తెలియదు

28 May, 2022 13:36 IST|Sakshi

Boney Kapoor Credit Card Misused And Lost Lakhs Of Money: ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్‌ నుంచి డబ్బు దోచుకున్నారు సైబర్‌ కేటుగాళ్లు. బోనీ కపూర్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా లక్షలు కొట్టేశారు. ఈ విషయంపై బోనీ కపూర్‌ బుధవారం (మే 25) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అంబోలీ పీఎస్ పోలీసులు పేర్కొన్నారు. బోనీ కపూర్‌ క్రెడిట్‌ కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌ తదితర డేటాను నిందితులు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ జరిపారు. 

ఈ ఐదు ట్రాన్సాక్షన్స్‌లతో మొత్తం రూ. 3.82 లక్షలను నిందితులు దోచుకున్నారు. అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్‌కు తెలియదని.. తర్వాత అకౌంట్స్‌ చెక్‌ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లోని ఒక అధికారి పేర్కొన్నారు. 

చదవండి:👇
త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు
వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..

మరిన్ని వార్తలు