ఉదయ్‌తో ఆర్టికల్‌ 15

25 Aug, 2020 06:47 IST|Sakshi
ఉదయ్‌నిధి స్టాలిన్‌

అజిత్‌తో హిందీ ‘పింక్‌’ని తమిళంలో రీమేక్‌ చేశారు బోనీ కపూర్‌. ఇప్పుడు మరో రీమేక్‌ను ప్రకటించారు. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించి, మెప్పించిన ‘ఆర్టికల్‌ 15’ని తమిళంలో రీమేక్‌ చేయనున్నారు బోనీ. ఒక సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ కులవివక్ష ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి చట్టం, న్యాయం అందరికీ సమానమే అని చాటిచెప్పిన చిత్రమిది. హిందీలో ఆయుష్మాన్‌ పోషించిన పాత్రను తమిళంలో ఉదయ్‌నిధి స్టాలిన్‌ చేయనున్నారు. అరుణ్‌రాజా కామరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జీ స్టూడియోస్, రోమియో పిక్చర్స్‌తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రొడక్షన్‌ హౌస్‌పై తమిళ రీమేక్‌ను నిర్మించనున్నట్లు బోనీ కపూర్‌ తెలిపారు. ‘పింక్‌’ తర్వాత అజిత్‌తో తమిళంలో ‘వలిౖమై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు బోనీ. ‘ఆర్టికల్‌ 15’ రీమేక్‌ షూటింగ్‌ని ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తారట.

మరిన్ని వార్తలు