Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ తొలి పాట వచ్చేసింది.. ‘బాస్‌ పార్టీ’ అదిరిపోయింది

23 Nov, 2022 16:15 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాస్​ పార్టీ సాంగ్ ​విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని తెలియజేసేలా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేశాడు. నకాష్ అజీజ్, హరిప్రియ అద్భుతంగా ఆలపించారు. మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన డాన్సులతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.

కలర్‌ఫుల్ చొక్కా, లుంగీ, చెవి పోగు, మెడలో గొలుసు, గడియారం, షూస్‌.. మాస్ అప్పీల్‌లో ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్నారు చిరంజీవి.  ఊర్వశి రౌతేలా చిరంజీవి ఎనర్జీకి తగ్గట్టుగా ప్రయత్నించి విజయం సాధించింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు