ది వారియర్‌ సగం హిట్‌ అయినట్లే : హీరో రామ్‌

3 Jul, 2022 07:39 IST|Sakshi
కృతిశెట్టి, రామ్‌

రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్‌’. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ – ‘‘అనంతపురంలో ట్రైలర్‌ లాంచ్‌ ఫంక్షన్‌ అనగానే హ్యాపీ ఫీలయ్యాను. ఇక్కడ ఫంక్షన్‌ జరుపుకుని ‘ది వారియర్‌’ సగం సక్సెస్‌ సాధించింది’ అన్నారు.

‘‘బోయపాటి శ్రీను గారి చేతుల మీదుగా ట్రైలర్‌ రిలీజైంది కాబట్టి సినిమా సగం హిట్‌ అయినట్లుగా భావిస్తున్నాం. సినిమాలోని ప్రతి ఎమోషన్‌ను లింగుసామి జెన్యూన్‌గా ఫీలై చేశారు’’ అన్నారు రామ్‌. ‘‘మీ అందరిలో (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) ఉన్న ఎనర్జీ అంతా రామ్‌ ఒక్కడిలోనే ఉంది’’ అన్నారు లింగుసామి. శ్రీనివాసా చిట్టూరి, ఆది పినిశెట్టి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు