మూడు భాషల్లో ఇద్దరు

16 Aug, 2020 04:24 IST|Sakshi
బోయపాటి శ్రీను, సోనీ చరిష్టా

అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరు’. ఎస్‌.ఎస్‌.సమీర్‌ దర్శకత్వంలో ఫర్‌హీన్‌ ఫాతిమా నిర్మిస్తున్నారు. తెలుగు–తమిళ–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి. చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, హీరో ఆమిర్‌ ఖాన్‌ సోదరుడు ఫైసల్‌ ఖాన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

శనివారం అర్జున్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ఇద్దరు’ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రబృందం విడుదల చేయించింది. ‘‘అర్జున్‌గారితో కలిసి నేను చేసిన స్పెషల్‌ సాంగ్‌ బోయపాటి సార్‌ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సోనీ చరిష్టా. ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి, చిత్ర సహనిర్మాత శశిధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు