వెరైటీగా.. స్కర్టులో స్టార్‌ హీరో.. ఫోటోలు వైరల్‌

21 Jul, 2022 11:13 IST|Sakshi

సినిమా ప్రమోషన్స్‌ కోసం హీరో, హీరోయిన్స్‌ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. సినిమాను ఆడియెన్స్‌కు దగ్గర చేసేందుకు ఢిపరెంట్‌ కాన్సెప్ట్స్‌తో ప్రమోషన్స్‌ చేస్తుంటారు. హాలీవుడ్‌ స్టార్‌ హీరో బ్రాడ్‌ పిట్‌ కూడా తన సినిమాను ప్రమోట్‌ చేసేందుకు వెరైటీ గెటప్‌లో దర్శనమిచ్చాడు. తన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'బుల్లెట్‌ ట్రైన్‌' త్వరలోనే రిలీజ్‌ కానుంది.

ఇప్పటికే ట్రైలర్‌తో మాంచి హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా బెర్లిన్‌ ప్రీమియర్‌కు వచ్చిన బ్రాడ్‌ పిట్‌ లినెన్‌ స్కర్ట్‌తో కనిపించి అందరికి షాకిచ్చాడు. మ్యాచింగ్‌ బ్రౌన్‌ జాకెట్‌, పింక్‌ షర్ట్‌తో స్టైలిష్‌ గెటప్‌లో సందడి చేశాడు. అంతేకాకుండా ఈ గెటప్‌లో తన కాలిపై ఉన్న టాటూలతో మరింత స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు.

ఒక కాలికి ఖడ్గమృగం, మరో కాలికి పుర్రె టూటూలతో బ్రాడ్‌ పిట్‌ స్పెషల్‌ లుక్‌లో కనిపించారు. ఇక ఈ ప్రీమియర్‌ షోకి జోయి కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీతో సహా మిగిలిన తారాగణం సందడి చేసింది.

మరిన్ని వార్తలు