పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క.. "బ్రహ్మచారి" ట్రైలర్‌..

22 Aug, 2022 14:52 IST|Sakshi

దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో  పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి దొరకక తను ఎలాంటి  ఇబ్బంది పడ్డాడు అనేదే ఈ "బ్రహ్మచారి" కథ. పొడిచేటి మూవీ మేకర్స్ పతాకంపై  వెండితెరకు దర్శకుడుగా పరిచయం కాబోతున్న కొత్త కెరటం నర్సింగ్ దర్శకత్వంలో నూతన నటీనటులతో రమేష్ మాస్టర్ శ్రీ కిరణ్, విగ్నేష్ లు  సంయుక్తంగా నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం "బ్రహ్మచారి'".ఈ చిత్రం ఫస్ట్ లుక్  మరియు ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు.  

కార్యక్రమానికి  ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ కె బసి రెడ్డి గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ లయన్ డాక్టర్ ప్రతాని  రామకృష్ణ గౌడ్ , ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు లయన్ డాక్టర్ సాయి వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ..మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.


పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వయసు పైబడ్డ వాళ్ళు డబ్బులున్నా, ఎంత ఇబ్బంది పడతారో కామెడీ గా చెప్పాలనుకున్నాను. ఇందులో నేను ఎదుర్కున్న అనుభవాలు కూడా ఉండవచ్చు.నిజ జీవితం లో ఎదురయ్యే సంఘటనలతో  ఈ "బ్రాహ్మ చారి" సినిమా తియ్యడం జరిగింది. అన్నారు.

మరిన్ని వార్తలు