Hrashwo Deergha Movie: తెలుగు, నేపాలీ భాషల్లో... 

2 Feb, 2024 05:56 IST|Sakshi

ప్రముఖ నటుడు బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న తొలి తెలుగు, నేపాలీ చిత్రం ‘హ్రశ్వదీర్ఘ’. చంద్ర పంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హరిహర్‌ అధికారి, నీతా దుంగన లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. నీతా ఫిలిమ్స్‌ ప్రోడక్షన్‌పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘హ్రశ్వదీర్ఘ’లోని ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయడంతో పాటు ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు