ఆ కమెడియన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మీ!

28 Apr, 2021 20:33 IST|Sakshi

నటుడు బ్రహ్మానందం కమెడియన్‌గా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. కామెడీ అంటే బ్రహ్మీ.. బ్రహ్మీ అంటే కామెడీ అనేంతగా ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ హాస్యాన్ని పండిస్తాడు. ఇలా హాస్యా బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ఆయన తన తాజా చిత్రంలో జబర్తస్థ్‌ కమెడియన్‌ను ఫాలో అవుతున్నారట.

అయితే ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలు తగ్గించిన బ్రహ్మీ.. ప్రస్తుతం ‘రంగమార్తండ’లో నటిస్తున్నాడు. దీనితో పాటు ఆయన నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా వస్తున్న ‘పెళ్లి సందడి’లో నటిస్తున్నాడు. ఈ పెళ్లి సందడిను కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో గేటప్‌ శ్రీనును బ్రహ్మీ కాపీ కొడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా జబర్థస్త్‌ కామెడీ స్టేజ్‌పై ఎన్నో రకాల పాత్రలు పోషించి నవ్వులు పూయించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీను. అందులో అతడు వేసిన బిల్డప్‌ బాబాయి పాత్ర ఎంతో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రను అదే తరహాలో దర్శకుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’లో పెట్టినట్లుగా సమాచారం. ఈ పాత్రకు బ్రహ్మీనే సంప్రదించడం.. ఆయన దీనికి ఒకే చెప్పడం విశేషం. అలా బ్రహ్మీ ఈ మూవీలో గెటప్‌ శ్రీనును అనునాయించనున్నాడట. ఏకంగా హాస్యా బ్రహ్మా.. గెటప్‌ శ్రీనును ఫాలో అవుతుండటంతో అతడి క్రేజ్‌ మరింత పెరగనుందని చెప్పుకొవచ్చు. కాగా ఈ సినిమాలో రోషన్‌కు జోడిగా శ్రీలీల హీరోయిన్‌గా పరిచయం కానుంది.

చదవండి: 
టీజర్‌ హిట్‌.. రెమ్యునరేషన్‌ పెంచిన బాలయ్య
వైరల్‌ అవుతోన్న జూ. ఎన్టీఆర్‌ అరుదైన వీడియో..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు