'వరదరాజు' పాత్రలో బ్రహ్మానందం.. స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌

2 Feb, 2023 09:00 IST|Sakshi

తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో భరత్‌ కుమార్, శ్రీపాద్‌ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్‌ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. ఎనిమిది ప్రధాన పాత్రలతో ఈ మూవీ రూపొందుతోంది. వారిలో బ్రహ్మానందం ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

బుధవారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘మీ ప్రపంచం వింతగా మారబోతోంది’ అని పోస్టర్‌పై క్యాప్షన్‌ ఇచ్చారు. ‘‘ప్రతి ఇంట్లో ఉండే తాత పాత్రలో (వరదరాజు) బ్రహ్మానందంగారు కనిపిస్తారు’’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌.

మరిన్ని వార్తలు