Brahmastra: ఈ ఏడాది నంబర్‌వన్‌గా బ్రహ్మస్త్ర.. ఆ సినిమాలను వెనక్కి నెట్టి..!

7 Dec, 2022 16:22 IST|Sakshi

బాలీవుడ్ జంట అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా నిలిచింది.

కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్‌ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్  'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి.  ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్‌ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 

మరిన్ని వార్తలు