Brahmastra Box Office Collection: ‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

10 Sep, 2022 16:19 IST|Sakshi

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా  చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా  నటించనగా, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, షారూక్‌ ఖాన్‌ మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్‌9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ చిత్రంలో స్టార్‌ హీరోలు నటించడంతో తొలి రోజు మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్ల రాబట్టినట్లు తెలుస్తోంది.

(చదవండి:  ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ)

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాత కరణ్‌ జోహర్‌  సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. హాలీడే కాక‌పోయిన‌ప్ప‌టికీ ఇండియా వైడ్‌గా  రూ. 35-38 కోట్ల షేర్‌ వ‌సూలు చేసింద‌ని ట్రేడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్‌లో కూడా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం  రూ. 6.7 కోట్లు గ్రాస్(రూ.3.7 కోట్ల షేర్‌) వ‌సూళ్ల‌ను సాధించింది.

తెలుగులోకి అనువాదమైన బాలీవుడ్‌ చిత్రాల్లో ఇది సరికొత్త రికార్డు. అంతకు ముందు ఆమిర్‌ ధూమ్‌ 3 చిత్రం రూ.4.7 కోట్లు సాధించింది. ఆ రికార్డుని బ్రహ్మాస్త్ర బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌(హిందీ, తెలుగు వెర్షన్లతో కలిపి) జరిగింది.  బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు