వాస్తవ సంఘటనలతో ‘భ్రమర’

21 Sep, 2023 19:31 IST|Sakshi

30 ఇయర్స్ పృద్వి , పృద్వి రాజ్(పెళ్లి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భ్రమర. టి.వి రవి నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగమహేష్, జయవాణి,మీసాల లక్ష్మణ్, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, దువ్వాసి మోహన్, పసునూరి శ్రీనివాస్, మాణిక్యం, టార్జాన్ ఇతర కీలక పాత్రలో పోషిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్  చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ కుర్మచలం  కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి  రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం  వహించారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో  గెస్ట్ గా వచ్చిన హైకోర్ట్ అడ్వకేట్ సుంకర నరేష్  మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అయితే ప్రజలను అవగాహన పరస్తూ ప్రజలలో చైతన్యం తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో  దర్శక, నిర్మాతలు డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్స్ లో "భ్రమర" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ టైటిల్ లో ఎటువంటి సౌండ్ ఉందో సినిమాలో కూడా అటువంటి సౌండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మీడియా తో పాటు  ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తూ మూవీ యూనిట్ ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

‘డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ మీద ఈ  సినిమా నడుస్తుంది. .ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రాహుల్ శ్రీ వాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్ గా కార్తీక్ బి. కొడగండ్ల చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి ,పెళ్లి సినిమా పృద్వి రాజ్ తో పాటు నికితశ్రీ లీడ్ రోల్ లో నటిస్తుంది’అని దర్శకుడు టీవీ రవి నారాయణన్‌ అన్నారు. ‘మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని  నటి నిత్య శ్రీ అన్నారు

మరిన్ని వార్తలు