మరో అర్జున్‌రెడ్డిలా ‘బ్రాందీ డైరీస్‌’.. ట్రైలర్‌ చూశారా?

31 Mar, 2021 15:42 IST|Sakshi

‘‘ఆల్కహాల్‌ తాగితే వచ్చే ఇబ్బందులు ఏంటి? దాని వల్ల ఏం నష్టం జరుగుతుంది? అనే విషయాన్ని ‘బ్రాందీ డైరీస్‌’ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని డైరెక్టర్‌ శివుడు అన్నారు. గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా కలెక్టీవ్‌ డ్రీమర్స్‌ పతాకంపై లేళ్ల శ్రీకాంత్‌ నిర్మించిన క్రౌడ్‌ ఫండెడ్‌ చిత్రం ‘బ్రాందీ డైరీస్‌’ త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ–‘‘ఆరుగురు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆల్కహాల్‌ నేపథ్యంలోనే ఉంటుంది.  రెగ్యులర్‌ సినిమాలా ఉండదు.. ఉత్కంఠగా ఉంటుంది.

హాలీవుడ్‌ కెమెరామ్యాన్‌ మోనిక్‌ కుమార్‌తో పాటు ఈశ్వరన్‌ తంగవేల్‌ మా సినిమాకు పనిచేశారు. ప్రకాశ్‌ రెక్స్‌ సంగీతం బాగుంటుంది. పెంచల్‌ దాస్‌ రాసి, పాడిన పాట బాగా పాపులర్‌ అయ్యింది’’ అన్నారు.  ‘‘52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్‌ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాం. మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు లేళ్ల శ్రీకాంత్‌. ‘‘మంచి సందేశాత్మక సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు శేఖర్, సునీత సద్గురు. వైజాగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ శంకర్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు