బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్‌

14 Nov, 2021 19:41 IST|Sakshi

కొన్ని విలువైన వస్తువులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ నష్టాన్ని భర్తి చేయడం కోసం సాధారణంగా మనం ఇల్లు, కారు, వాహనాలకు బీమా చేయడం కొత్తేమీ కాదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆ బీమా డబ్బుని క్లైయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహాలోనే కొంద‌రు సెల‌బ్రిటీలు త‌మ శరీర భాగాలకు ఇన్సురెన్స్ చేయించుకుంటుంటారు. ఈ జాబితాలో తారలు కూడా ఉన్నారు.

తాజాగా బ్రేజిల్‌లో ఓ మోడల్ కూడా త‌న బాడీలోని ఓ పార్ట్‌ను ఏకంగా 13 కోట్ల రూపాయ‌ల‌కు ఇన్సురెన్స్ చేయించుకుంది. ఇంత‌కీ ఏంటా పార్ట్ అంటారా? ఆ మోడల్‌ త‌న పిరుదుల‌ను ఇన్సురెన్స్ చేయించుకుంది. ప్రత్యేకంగా వాటికే ఎందుకంటే.. బ్రెజిల్‌కు చెందిన మోడ‌ల్ నాథీ కిహారాకు త‌న పిరుదులే అందం. వాటి వ‌ల్ల‌నే త‌ను మిస్ బుమ్‌బుమ్ 2021 వ‌ర‌ల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె తన పిరుదుల కారణంగానే ప్రసిద్ధి చెందానని, అందుకే వాటికి  £1.3 మిలియన్లకు (సుమారు రూ. 13 కోట్లు) బీమా చేయించుకుంటున్నట్లు చెప్పింది.

నాథీ ఈ విషయమై మాట్లాడుతూ.. నా పిరుదులు పూర్తిగా సహజమైనది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ పొందుతున్నాను. తల్లిగా మారిన తర్వాత జిమ్‌లో బరువులు ఎత్తడం కంటే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది.

చదవండి: Britney Spears: నా జీవితంలో ఇదే అత్త్యుత్తమ రోజు: బ్రిట్నీ స్పియర్స్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు