ప్రియాంకకు చేదు అనుభవం: జమీలా, నిక్‌ విడాకులు?

2 Mar, 2021 13:04 IST|Sakshi

బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తూనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగింది ప్రియాంక చొప్రా. ఈ క్రమంలో అమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను పెళ్లి చేసుకుని హాలీవుడ్‌కే మాకాం మార్చింది. ఈ క్రమంలో ప్రియాంక హాలీవుడ్‌ ఆరంగేట్రం చేసిన కొత్తలో తరచూ ఆమెకు చేదు అనుభవాలను ఎదురయ్యాయి. ఎన్నో సందర్భాల్లో ఇతర నటీనటులను చూసి ప్రియాంక అనుకుని అక్కడి వారు పప్పులో కాలేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ఆమెకు ఈ సంఘటనలు చేదు అనుభవాలుగా మిగిలిపోతున్నాయి. తాజాగా మరోసారి ప్రియాంక అలాంటి సంఘటనే ఎదురైంది. బ్రిటిష్‌ నటి జమీలా జమిల్‌ను చూసి ఓ ట్విటర్‌ యూజర్‌ ప్రియాంక అనుకొని పప్పులో కాలేశాడు. అంతటితో ఊరుకోకుండా ‘ఒకవేళ నిక్‌ జోనస్‌, జమీలా జమిల్‌లకు విడాకులు అయితే’ అంటూ ట్వీట్‌ చేశాడు.

అది చూసిన జమీలా తనదైన శైలిలో అతడికి సమాధానం ఇచ్చింది. ‘భిన్నమైన భారత మహిళ, ఏ మాత్రం నాలా కనిపించని ప్రియాంక చొప్రా, ఆమె భర్త ఇద్దరూ హ్యాపీ ఉన్నారని నమ్ముతున్నా’ అంటూ తను ప్రియాంక కాదని అతడికి స్పష్టం చేసింది. అది చూసి ప్రియాంక స్పందిస్తూ.. ‘లాల్‌’ అంటూ హర్ట్‌, పంచ్‌ ఎమోజీలను జత చేసింది. కాగా జమీల బ్రిటిష్‌ నటి, మోడల్‌. అంతేగాక గుడ్‌ ప్లేస్ వంటి కామెడీ షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యహరించింది. లండన్‌ త్వరలో రాబోయే మరిన్ని షోలకు కూడా ఆమె జడ్జీగా, వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. 

కాగా కొన్నేళ్ల క్రితం ఏబీసీ విడుదల చేసిన ఎయిర్‌ క్వాంటికోలో ప్రియాంక బదులు నటి, మోడల్‌ యుక్తా ముఖే చిత్రాన్ని ప్రచురించారు. అలాగే 2019లో వచ్చిన ఓ మ్యాగజేన్‌లో మోడల్‌, రచయిత పద్మ లక్ష్మిని స్టోరికి ప్రియాంక ఫొటోలను ఉపయోగించారు. ఇక 2017లో అమెరికాలోని ఓ ఈవెంట్‌లోన పాల్గోన్న దీపికాను చూసి ప్రియాంక చొప్రాగా పొరబడ్డారు. దీంతో ప్రియాంక ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఇది అన్యాయం, అజ్ఞానం. ఇది సరైనది కాదు. గోధుమ వర్ణంలో ఉండే ప్రతి అమ్మాయి ఒకేలా ఉండదు. ప్రపంచ జనాభాలో అయిదవ వంతు భారతీయులు ప్రపంచ సినిమాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అది మా బాధ్యత కూడా. మమ్మల్ని అలాగే చూడండి’ అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ప్రియాంక డ్రెస్సింగ్‌పై విపరీతమైన ట్రోలింగ్‌
    
  భజ్జీ సినిమా టీజర్‌ విడుదల, విషెస్‌ చెప్పిన రైనా
      ‘భీష్మ’ డైరెక్టర్‌ వెంకీ కుడుములకు టోకరా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు