ఈ అమ్మాయే నా భర్తను దొంగలించింది: నటి

17 Sep, 2020 18:25 IST|Sakshi

ముంబై: బ్రెజిలియన్‌ బాలీవుడ్‌ నటి, మోడల్‌ బ్రూనా అబ్దుల్లా గురువారం ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్టును పంచుకున్నారు. ఇందులో తన భర్త అలన్ ఫ్రేజ్‌ను దొంగలించిన అమ్మాయి ఫొటోలను, వీడియోను పంచుకున్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్‌ అవ్వాల్సిందే. ఆ అమ్మాయి ఎవరో కాదు బ్రూనా-ఫ్రేజ్‌ల ఏడాది కూతురు ఇసాబెల్లా. తన భర్త, కూతురు ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘ఈ అమ్మాయే నా భర్తను దొంగలిచింది’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్టు చేసి అందరికి స్వీట్‌ షాక్‌ ఇచ్చారు. ఇందులో ఫ్రేజ్‌, ఇసాబెల్లాలు సరదాగా ఆడుకుంటున్న వీడియోలను కూడా ఆమె షేర్‌ చేశారు.

ఇది చూసిన నెటిజన్లంతా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇసాబెల్లా చాలా క్యూట్‌గా ఉంది’, ‘హా హ్హా హ్హా.. బాగుంది’, ‘మీకు మరో అవకాశం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. తన చిరకాల మిత్రుడైన అలన్‌ ఫ్రేజ్‌ను బ్రూనా గత ఏడాది మే నెలలో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఏడాది కూతురు ఇసాబెల్లా ఉంది. ఇటీవల ఇసాబెల్లా మొదటి పుట్టిన రోజు జరుపుకున్న ఫోటోలు కూడా ఆమె షేర్‌ చేశారు.

Me vs the Girl who stole my husband 😝 @alfromscotland

A post shared by Bruna Abdullah (@brunaabdullah) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా