గ‌జ‌దొంగ బయోపిక్‌లో బెల్లంకొండ.. టైటిల్‌ ఇదే

11 Aug, 2021 17:11 IST|Sakshi

యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.. సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్‌ హీరో..తొలి మూవీతోనే సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్‌కు సరైన హిట్‌ లభించలేదు. దీంతో ఈ యంగ్‌ మీరో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన `ఛ‌త్ర‌ప‌తి` బాలీవుడ్‌ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్‌ హీరో మరో ఎగ్జయిటింగ్‌ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ సినిమాకి ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అనే పేరుని ఖరారు చేస్తూ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.  1970 కాలంలో స్టూవ‌ర్టుపురం ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖ గ‌జ‌దొంగ `టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు` బ‌యోపిక్ ఇది. 

నాగేశ్వ‌ర‌రావు త‌న జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా త‌ప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వ‌ర‌రావు త‌ప్పించుకున్న తీరుతో ఆయ‌న‌కు `టైగ‌ర్‌` అనే పేరు వ‌చ్చింది. పోలీసుల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మ‌ర‌ణించాడు. ఈ విష‌యాల‌తో  `స్టూవ‌ర్టుపురం దొంగ‌` సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.  ఈ చిత్రానికి ఎ.ఎస్‌. దర్శకత్వం వహించగా, ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బెల్లంకొండ సురేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ హై బ‌డ్జెట్ ఎంట‌ర్‌టైన‌ర్ కోసం ప్ర‌ముఖ టెక్నీషియ‌న్స్ అంద‌రూ ప‌నిచేస్తున్నారు.  మెలోడి బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తుండ‌గా, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు