ఆసక్తికరంగా 'ప్రత్యర్థి' ట్రైలర్‌

3 Jan, 2023 14:36 IST|Sakshi

రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షత సోనవానెలు ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రత్యర్థి’.  శంకర్ ముడావత్ దర్శకత్వ వహించిన ఈ చిత్రాన్ని గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సంజయ్ సాహ నిర్మించారు. జనవరి 6న రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.

ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. నగరంలో జరిగిన మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్  చేసే ఎస్ఐ చనిపోయవడం, ఆ కేసును పరిష్కరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగడం వంటివి చూపించడం వల్ల మొదట్లోనే కట్టిపడేసినట్టు అయింది ట్రైలర్. ఇక ఈ ట్రైలర్‌ చూస్తుంటే ట్విస్టులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ మూడ్‌ను మెయింటైన్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ పాల్ ప్రవీణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు