జూ.ఎన్టీఆర్‌కు బుచ్చిబాబు బర్త్‌డే విషెస్‌, ఫ్యాన్స్‌కు డైరెక్టర్‌ సర్‌ప్రైజ్‌

20 May, 2021 19:41 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, స్టార్‌ హీరోలు, దర్శకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి కోమరంభీం ఇంటెన్స్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

ఈ క్రమంలో తాజాగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సానా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెబుతూ అభిమానులకు క్రేజీ అప్‌డేట్‌ను అందించాడు. కాగా కొంతకాలం వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ డ్రామ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌ 60 ఏళ్ల మాజీ ఆటగాడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంత వరకు స్ఫష్టత లేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా బుచ్చిబాబు ఆసక్తికర ట్వీట్‌ చేశాడు.

‘హ్యాపీ బర్త్‌డే నందమూరి తారకరామరావు గారు. లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించడానికి వెయింటింగ్‌ సార్‌’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అది చూసిన అభిమానులు త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ పాన్‌ ఇండియా మూవీ రాబోతుందని అంచన వేస్తూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఓ మూవీ చేస్తున్నాడు. అంతేగాక ‘కేజీఎఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌తో కలిసి ఓ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాతే బుచ్చిబాబుతో సినిమా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు