పుష్ప సినిమాపై ఉప్పెన డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

14 Jun, 2021 15:39 IST|Sakshi

కాలం మారుతోంది. ఒకప్పుడు నార్త్‌ ఇండియా సినిమాలంటే ఎక్కువ ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు నార్త్‌ ఇండస్ట్రీ కూడా సౌత్‌ వైపు ఆశగా చూస్తోంది. ఇక్కడి సినిమాలను దిగుమతి చేసుకుంటోంది. డబ్బింగ్‌, రీమేక్‌ అంటూ దక్షిణాది భాషా చిత్రాల మీద అత్యంత ఆసక్తి కనబరుస్తోంది. దీంతో ఇక్కడి సినిమాలు కూడా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రభాస్‌ రాధేశ్యామ్‌, సలార్‌, అల్లు అర్జున్‌ పుష్ప కూడా పాన్‌ ఇండియా చిత్రాలే. తాజాగా పుష్ప సినిమా గురించి సుకుమార్‌ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా చూశాక తన గురువు సుకుమార్‌ మీద అసూయ కలిగిందని తెలిపాడు. పుష్ప ఒక్కటే పది కేజీఎఫ్‌ సినిమాలతో సమానం అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూశాక అల్లు అర్జున్‌లా మరెవరూ నటించలేరేమో అనిపిస్తోందని పేర్కొన్నాడు. డీఎస్పీ కంపోజ్‌ చేసిన పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయని, ఇప్పటికీ కొన్ని పాటలు తన మెదడులో మార్మోగుతూనే ఉన్నాయని తెలిపాడు.

కాగా పుష్ప చిత్రంలో రష్మిక మందన్నా పల్లెటూరి యువతిగా అలరించనుంది. మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. అనసూయ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ దసరా లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో లేదా 2023లో రిలీజ్‌ అవుతుంది.

చదవండి: ‘పుష్ప’ ఆ యాక్షన్‌ సిక్వెన్స్‌ హైలెట్‌..

మరిన్ని వార్తలు