‘బుజ్జి ఇలా రా’ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన అల్లరి నరేశ్‌

14 Aug, 2022 08:01 IST|Sakshi

సునీల్, ధన్‌రాజ్‌ హీరోలుగా చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌గా నటింన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందింన ఈ త్రానికి ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. రపా జగదీశ్‌ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో ‘అల్లరి’ నరేశ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వర రెడ్డిగారు నాకు ‘సీమశాస్త్రి, సీమటపాకాయ్‌’ లాంటి పెద్ద విజయాలు ఇచ్చారు.

అంజి కెమెరామేన్‌ అవ్వకముందే నాకు తెలుసు. అంతమంచి టెక్నీషియన్‌ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకుడు స్క్రిప్ట్‌ అందిం, దర్శకత్వంలో సహాయంగా ఉండటం ఖ్చతంగా ఈ సినివ టెక్నీషియన్‌ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకుడు స్క్రిప్ట్‌ అందించి, దర్శకత్వంలో సహాయంగా ఉండటం ఖచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనడానికి నిదర్శనం’’ అన్నారు.

‘‘ఈ చిత్రంలో నాది సీరియస్‌ రోల్‌’’ అన్నారు ధన్‌రాజ్‌. ‘‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘ఈ సినిమా ఆడకపోతే నా స్నేహితులు నాగిరెడ్డి, జగదీశ్, సంజీవ్‌ రెడ్డి నష్టపోతారు.. కాబట్టి ఆదరించండి’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘మా సినిమాని థియేటర్లోనే చూడాలి’’ అన్నారు నాగిరెడ్డి, సంజీవరెడ్డి.   
 

మరిన్ని వార్తలు