గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న మరో సినిమా

9 Dec, 2021 09:16 IST|Sakshi

దేవరాజ్, సోనాక్షీ వర్మ జంటగా మదుగోపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్‌ సత్యం’. లక్ష్మీ నారాయణ సమర్పణలో సాయితేజ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై దేవరాజ్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ–‘‘దేవరాజ్‌కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా, నిర్మాతగా చక్కగా చేశాడు.

గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘మా సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. యాజమాన్య మంచి సంగీతం అందించారు’’ అన్నారు హీరో, నిర్మాత దేవరాజ్‌. ‘‘ఒక ఎంపీటీసీ స్థానం కోసం ఎలా పరితపిస్తారు? ఆ పదవి కోసం హీరో జీవితంలో ఏం కోల్పోయాడు? ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే చిత్రకథ’’ అన్నారు మధు గోపు. 

మరిన్ని వార్తలు