Jailer Movie: రూ.650 కోట్లు రాబట్టిన జైలర్‌ మూవీని రిజెక్ట్‌ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరంటే?

22 Sep, 2023 15:02 IST|Sakshi

ఓ లవ్‌ స్టోరీ, రెండు,మూడు పాటలు, ఫైటింగ్‌లు.. చాలా సినిమాల్లో ఇదే జరుగుతుంది. కానీ కొన్ని చిత్రాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అందులో ఒకటి జైలర్‌. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌ లేదు, రొమాంటిక్‌ సాంగ్స్‌ లేవు, రౌడీలను హీరో చితక్కొట్టే సన్నివేశాలూ పెద్దగా లేవు. అయినా బొమ్మ బ్లాక్‌బస్టర్‌.. అదీ రజనీకాంత్‌కు, ఆయన ఎంచుకున్న కథకు ఉన్న సత్తా! కొంతకాలంగా వరుస అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన జైలర్‌తో దుమ్ములేపాడు.

జైలర్‌ కథ ఫస్ట్‌ ఆయనకే వినిపించాడా?
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంతటి భారీ బ్లాక్‌బస్టర్‌ సినిమాను ఓ హీరో చేజేతులా వదిలేనుకున్నాడంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్‌ చిరంజీవి! డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ మొదట ఈ కథను చిరంజీవికి వినిపించాడట! అయితే పెద్దగా పాటలు గట్రా లేకపోవడంతో చిరు అంతగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఏమని సమాధానం చెప్పాలో తెలియక తర్వాత చూద్దాంలే అని దాటవేశాడట.

ఒకరికి బ్లాక్‌బస్టర్‌.. మరొకరికి డిజాస్టర్‌
విషయం అర్థమైన నెల్సన్‌.. రజనీకాంత్‌ను కలవగా ఆయన వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట! ఇకపోతే రజనీ జైలర్‌(ఆగస్టు 9న), చిరంజీవి భోళా శంకర్‌ (ఆగస్టు 11న) కేవలం రెండు రోజుల వ్యవధితో థియేటర్లలో విడుదలయ్యాయి. భోళా శంకర్‌ ఫస్ట్‌ షోకే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుని అపజయాన్ని మూటగట్టుకోగా జైలర్‌ హిట్‌ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది.

చదవండి: రైతు బిడ్డకు 26 ఎకరాలు, 4 కార్లు, కోట్ల ఆస్తి?.. ప్రశాంత్‌ తండ్రి ఏమన్నాడంటే?

మరిన్ని వార్తలు