ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో హీరో హీరోయిన్లు వీరే!

26 Oct, 2022 12:07 IST|Sakshi

భారత మాజీ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తమిళంలో తొలి సినిమాను నిర్మించనున్నాడు. గ్రాఫిక్‌ నవల ‘అధర్వ: ది ఆరిజన్‌’ రచయిత రమేశ్‌ తమిళ్‌ మణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇందులో హీరో, హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనేది మాత్రం చెప్పలేదు.

తాజా సమాచారం ప్రకారం ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో  హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం పేరున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ధోని నుంచి రాబోయే తొలి చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి. 

మరిన్ని వార్తలు