Sreeleela: ఒక్క సినిమాతో చుక్కలు చూపిస్తున్న శ్రీలీల!

4 Feb, 2022 14:25 IST|Sakshi

టాలీవుడ్‌కు ఎందరో హీరోయిన్స్‌ను పరిచయం చేసిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుదే! తెరపై కథానాయికలను ఆయన చూపించినంత అందంగా మరే డైరెక్టర్‌ చూపించలేడంటే అతిశయోక్తి కాదు. ఇటీవల పెళ్లి సందD మూవీతో శ్రీలీలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో నటనతో అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిందీ కన్నడ భామ. తొలి సినిమా హిట్‌ అవ్వడంతో తన రెమ్యునరేషన్‌ను బీభత్సంగా పెంచేసిందీ బ్యూటీ.

పెళ్లి సందD మూవీకి రూ.5 లక్షల పారితోషికం అందుకుంది శ్రీలీల. ఈ సినిమా మరీ అంతగా విజయం అందుకోకపోయినప్పటికీ తన రెండో సినిమాకు ఏకంగా రూ.40 లక్షలు తీసుకుందట. ఈ మధ్యే మూడో సినిమాకు సైతం సంతకం చేసిన ఈ భామ మరో పాతిక లక్షలు పెంచేసినట్లు తెలుస్తోంది. ఇక మీదట చేయబోయే సినిమాలకైతే ఏకంగా కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తానంటోందట. ఆమె దూకుడు చూసి దర్శకనిర్మాతలు నోరెళ్లబెడుతున్నారట!

మరిన్ని వార్తలు