Mahesh Babu: దిమ్మతిరిగే ట్విస్ట్.. ‘లక్ష్మీ నరసింహ స్వామి’గా మహేశ్‌!

6 Oct, 2021 16:58 IST|Sakshi

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అతడు స్క్రీన్ పై కనిపిస్తే కలెక్షన్ల వర్షమే.. మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్ బస్టర్స్ కొడుతుంటాడు. పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఐతే.. గెటప్స్ విషయంలో మాత్రం పెద్దగా వేరియేషన్ చూపించడు. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చబోతున్నాడు. ఎడ్వేంచరస్ గెటప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’, 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’..ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు. ఎన్నో  సూపర్‌ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మహేశ్‌ గెటప్స్ జోలికి మాత్రం పెద్దగా పోలేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరిలో మాత్రం కాస్త లాంగ్ హెయిర్ తో కనిపించి వేరియేషన్ చూపించాడు. 1 నేనొక్కడినే చిత్రంలో బాడీ షేప్ కాస్త మార్చాడు. అతిథిలో కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేశాడు. ఐతే.. అవేమీ పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు కావు. ఐతే.. ఈ సారి మహేశ్‌ ఎవరూ ఊహించని గెటప్ లో కనిపంచబోతున్నాడని తెలుస్తోంది.  

ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఇందులో మహేశ్‌ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్‌ బ్యాంగ్ కు ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. ఆ సీన్ లో మహేశ్‌ బాబు లక్ష్మీ నరసింహ స్వామి గెటప్ లో కనిపించ బోతున్నాడట. విలన్ మహేశ్‌ను అలా ఊహించుకుంటాడట. అదే నిజమైతే.. మహేశ్‌ అతిపెద్ద ఎడ్వేంచర్ చేస్తున్నట్టే. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్ లోకి దిగబోతుంది.
 

మరిన్ని వార్తలు