అల్లు అరవింద్‌ భారీ స్కెచ్‌.. ‘కాంతార’ దర్శకుడితో రామ్‌ చరణ్‌ మూవీ!

23 Oct, 2022 19:24 IST|Sakshi

టాలీవుడ్‌లో కాంతర హవా ఇంకా కొనసాగుతుంది. ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో  గీత ఆర్ట్ సంస్థ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్‌ 15న విడుదల చేశాడు. తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను రీసీవ్‌ చేసుకుంటారో లేదో అనే అనుమానంతో పెద్దగా ప్రమోషన్స్‌ లేకుండా సినిమాను విడుదల చేశారు. కానీ మౌత్‌ టాక్‌తో ఈ సినిమా భారీ విజయం సాధించింది. రిషబ్‌ శెట్టి టేకింగ్‌, యాక్టింగ్‌కి టాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రిషబ్‌ శెట్టితో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నానని ప్రకటించారు. అయితే అందరూ ఆయనను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారేమో అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

రిషబ్ శెట్టి తో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. రిషబ్ శెట్టి వద్ద ఒక ఆసక్తికరమైన లైన్ ఉందట. దానిని తెరకెక్కించాలంటే అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్యూసర్లకే సాధ్యమవుతుందని, ఆయనను సంప్రదించాడట. ఈ స్టోరీకి రామ్‌ చరణ్‌ అయితే బాగుంటుందని రిషబ్‌ భావిస్తున్నాడట. చరణ్‌కి స్టోరీ నచ్చి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. ఈ క్రేజీయెస్ట్‌ కాంబో రావడం గ్యారెంటీ. 

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి కొంచెం గ్యాప్‌ రావడంతో జపాన్‌ పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. 

మరిన్ని వార్తలు