సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్‌ప్రైజ్‌

13 Feb, 2021 14:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సింగర్‌ సునీతకు భర్త రామ్‌వీరపనేని ప్రేమికులరోజు ను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తరువాత వస్తున్న తొలి వాలెంటైన్స్‌ డే కావడంతో ఆయన భారీ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌  చేస్తున్నారట. తన వాలెంటైన్‌కు విలువైన కానుక ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విహార యాత్రకు వెళ్లి వచ్చిన దంపతులు తాజాగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా అయిపోయారు. ముఖ్యంగా సునీత నేపథ్య గాయనిగా తన కుమార్తెను సెటిల్‌ చేసేందుకు భారీ కసరత్తే చేస్తున్నారట.

మరోవైపు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంను ప్లాన్ చేస్తున్నట్లు పలు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. గానగంధర్వుడు ఎస్‌పీ బాల సుబ్రహ్మణం కరోనాతో కన్నుమూసిన నేపథ్యంలో ఆ లోటును సాధ్యమైనంతవరకు భర్తీ చేయాలని సునీత యోచిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ రియాలిటీషో  సన్నాహకాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా  ఉండే సునీతారామ్‌  దీనిపై ఎప్పటికి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు