సక్సెస్‌ను హ్యాండిల్‌ చేయడం కష్టం 

1 Dec, 2023 03:25 IST|Sakshi

‘‘బుల్లితెర షోలకు టీఆర్పీ రేటింగ్స్‌కు ఎక్కువ ప్రాంధాన్యత ఉంటుంది. కానీ సినిమాలకైతే దర్శకుల భవిష్యత్, నిర్మాత డబ్బులు, వినోదాన్ని ఆశించి థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకులు.. ఇలా చాలా విషయాలు ఆలోచించాలి. నా ‘గాలోడు’ సినిమా అంత పెద్ద సక్సెస్‌ అవుతుందని ఊహించలేదు. ఫెయిల్యూర్‌ను హ్యాండిల్‌ చేయడం సులభమే. కానీ సక్సెస్‌ను హ్యాండిల్‌ చేయడం కష్టం’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్‌.

అరుణ్‌ విక్కీరాల దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. విజేష్‌ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్‌ మాట్లాడుతూ– ‘‘కాలింగ్‌ సహస్ర’ కథ చెప్పినప్పుడు ఇందులోని ఓ పాయింట్‌ కొత్తగా అనిపించింది. నా కెరీర్‌లో ఇది ప్రయోగాత్మక సినిమా’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు