బాంద్రా డీసీపీ- రియా ఫోన్‌ కాల్స్‌

8 Aug, 2020 11:30 IST|Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాల్‌ లిస్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకు  వస్తున్నాయి. బాంద్రా డీజీపీ అభిషేక్‌ త్రిముఖితో రియా పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. రియాకు అభిషేక్‌ రెండు సార్లు కాల్‌ చేసినట్లు, రియా అభిషేక్‌కు రెండు పర్యాయాలు కాల్‌ చేసినట్లు ఉంది. కాల్స్‌తో పాటు ఒక మెసేజ్‌ కూడా చేశారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ముంబై పోలీసులు మాత్రం రియాను మొదట కేసుకు సంబంధించి విచారించగా తాను షాక్‌లో ఉన్నానని ఇప్పుడు ఏం చెప్పలేనని అన్నట్టు తెలిపారు. మరో సారి కేసుకు సంబంధించి మెసేజ్‌ చేసినప్పుడు రియా స్పందించలేదని తెలిపారు. ఇక రియాతో పాటు సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో నిందుతులుగా ఉన్న అందరితోనూ అభిషేక్‌ టచ్‌లో ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు. (దిశ మ‌ర‌ణించిన రాత్రి ఏం జ‌రిగింది?)

ఇదిలా వుండగా బిహార్‌ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి మీద కేసు నమోదు చేసిన సీబీఐ ఆమెను విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కాల్‌ డేటాపై విచారణ మొదలు పెట్టారు. వీటిలో ఎక్కువ సార్లు రియా తన తమ్ముడుకి కాల్‌ చేసింది. తరువాత తన తండ్రితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు తేలింది.

చదవండి: రియా వచ్చిన కారు ఎవరిదో తెలుసా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా