రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా?

30 Oct, 2020 10:51 IST|Sakshi

ప్రస్తుతం దేశంలోనే  ప్రఖ్యాత గేమ్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌ పతి సీజన్‌ 12 కొనసాగుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది  ప్రపంచానికి హీరోలాగా పరిచమ​య్యారు. ఎంతో మంది కష్టాలను ఈ షో తీర్చింది. సామాన్యులను రాత్రికి రాత్రి సెలబ్రెటీలుగా మార్చడమే కాకుండా వారిని ఆర్థికంగా కూడా ఆదుకుంది. ఇక ఈ షో సీజన్‌ 12లో మొదటిసారి ఒక వ్యక్తి కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకుంది. ఢిల్లీకి చెందిన ఛవికుమార్‌ రూ.50 లక్షలు గెలుచుకొని కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేక షో నుంచి వైదొలిగారు. దీంతో ఆమె తాను గెలుచుకున్న రూ. 50లక్షలతో ఇంటికి వెళ్లారు.

ఇక ఆమె సమాధానం చెప్పలేని కోటి రూపాయల ప్రశ్నకు మీకు సమాధానం తెలుసేమో ఒక సారి ప్రయత్నించండి. 2024లో చంద్రునిపైకి ఒక మహిళను, ఒక పురుషుడిని పంపించానికి అమెరికా చేపట్టిన ఒక స్పేస్‌ ప్రొగ్రామ్‌కు గ్రీక్‌ దేవత పేరు పెట్టారు. అది ఏమిటి? దీనికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. రియా, నెమెసిస్, ఆఫ్రొడైట్, ఆర్టెమిస్ అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఛవి కుమార్‌ తన లైఫ్‌లైన్స్‌ అన్నింటిని ఉపయోగించుకుంది. అయినప్పటికి సరైన సమాధానం తెలియకపోయేసరికి ఆట నుంచి తప్పుకుంది.

తరువాత ఆమెను ఆన్సర్‌ గెస్‌ చేయమని అడగ్గా ఆమె రియా అని చెప్పింది. ఒక వేళ ఆమె ఆట నుంచి క్విట్‌ కాకుండా ఉండి ఉంటే ఆమె రూ. 50 లక్షల నుంచి రూ. 3.20లక్షలకు పడిపోయేది. ఎందుకంటే ఆప్రశ్నకు సరైన సమాధానం ఆర్టెమిస్‌. ఇక ఛవికుమార్‌ గురించి చెప్పాలంటే ఆమె ఢిల్లీకి చెందినది.  ఆమె ఇంగ్లీష్‌ టీచర్‌గా పని చేసేది. ఆమె భర్త ఎయిర్‌ ఫోర్స్‌లో పని చేస్తున్నాడు. ఈ షోలో ఆమె ఒక ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ భార్యగా తాను పడిన కష్టాలను వివరించింది. 17 సంవత్సరాలలో 8 నగరాలను మారామని చెప్పింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నట్లు పేర్కొంది.      

చదవండి: 'కేబీసీ' చ‌రిత్రలోనే మొట్ట‌మొద‌టిసారిగా.. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా