వైరల్‌: ఇలియానాను మించిపోతోందిగా!

5 Apr, 2021 19:12 IST|Sakshi

జీరో సైజ్‌ నడుము, ఎరుపు రంగులో కురులు, ఒంపులు తిరిగిన శరీరం.. సన్నజాజి తీగలా కనిపిస్తోన్న ఈ భామను గుర్తుపట్టారా? ముఖం చూస్తే కానీ గుర్తుపట్టడం కష్టమేనంటారా? అయితే ఆవిడెవరో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరలవుతున్న ఈ ఫొటోలో ఉన్నది బాలీవుడ్‌ నటి సంజీదా. ఆమె తాజాగా షేర్‌ చేసిన ఈ పిక్‌ను అప్పుడే లక్ష మందికి పైగా లైక్‌ చేశారు. అందంలో ఇలియానాను మించి పోయేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

కాగా సంజీదా.. పంజాబీ సింగర్‌ జస్‌ మనాక్‌ రూపొందించిన 'సైయాన్'‌ మ్యూజిక్‌ వీడియోలో అందాలను ఒలకబోసి కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇక గతేడాది హర్షవర్ధన్‌ సరసన 'తైష్'‌ అనే యాక్షన్‌ డ్రామా చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇది నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో విడుదలైంది. ఈ సినిమాలో పుల్కిత్‌ సామ్రాట్‌, జిమ్‌ సార్బ్‌, కృతి కర్బందా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక హర్షవర్ధన్‌, సంజీదా కౌన్‌ 'ఫయా కున్‌' అనే హారర్‌ థ్రిల్లర్‌ చిత్రంలో మరోసారి జోడీగా నటిస్తున్నారు. కుషాన్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

చదవండి: వీకెండ్‌ లాక్‌డౌన్‌తో హిందీ చిత్రాలకు షాక్‌

'ఒరేయ్ బామ్మర్ది’ ఫస్ట్‌లుక్ విడుదల!

మరిన్ని వార్తలు