అందమైన మొహంతోనే ఐశ్వర్య సూపర్‌ స్టార్‌ అయ్యింది: నటుడు

7 Sep, 2021 18:03 IST|Sakshi

Russell Peters Comments On Aishwarya Rai Acting: మాజీ విశ్వ సుందరి, లేడీ సూపర్‌ స్టార్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌పై కమెడియన్‌ రస్సెల్‌ పీటర్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐశ్యర్య రాయ్‌ బ్యాడ్‌ యాక్టింగ్‌కు సరైన ఉదాహరణ అంటూ విమర్శించాడు. కాగా రస్సెల్‌ పీటర్స్‌ కెనడాకు చెందిన స్టాండప్‌ కమెడియన్‌, నిర్మాత. అయితే ఐశ్యర్య ఎన్నో సినిమాల్లో నటించి భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాసు, జోధా అక్భర్‌, గుజారిష్‌’ వంటి చిత్రాల్లో తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలా హీరోయిన్‌గా, విశ్వ సుందరిగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆమెపై రస్సెల్‌ పీటర్స్‌ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఆ సమయంలో అక్షయ్‌ బచ్చన్‌ కుటుంబానికి క్షమాపణలు కోరాడు.

చదవండి: సిద్ధార్థ్‌ శుక్లా మృతి: ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్‌ బ్యూటీ

కాగా అక్షయ్‌ ఇండో-కెనడియన్‌ చిత్రంలో నటించిన ఈ మూవీ వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ నేపథ‍్యంలో ఆ మూవీ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటన మరోసారి తెరపైకి వచ్చింది. 2011 వచ్చిన ఇండో-కెనడియన్‌ సినిమా ‘స్పీడీ సింగ్స్‌’ ప్రమోషన్‌లో భాగంగా రస్సెల్‌ పీటర్స్‌ ఇండియాకు వచ్చాడు. ఈ మూవీలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన ఈ మూవీ కార్యక్రమంలో రస్సెల్‌ మాట్లాడుతూ.. బాలీవుడ్‌ పరిశ్రమ, ఐశ్వర్య రాయ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు అతడు ‘నాకు బాలీవుడ్‌ పరిశ్రమ అంటే నచ్చదు. హిందీ సినిమాల్లో అంతా చెత్త ఉంటుంది. జస్ట్‌ టెర్రిబుల్‌. ఇది నా ఓపినియన్‌. కానీ బాలీవుడ్‌ సినిమాలకు, నటీనటులకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. నా జీవిత కాలంలో ఇంతవరకు నేను బాలీవుడ్‌ సినిమా చూడలేదు. ఎందుకంటే నాకు వారి పాటలు, డ్యాన్స్‌లు, నటన అంటే అసలు నచ్చదు’ అంటూ విమర్శించాడు.

చదవండి: భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్‌ రొమాంటిక్‌ రిప్లై

అంతేగాక ‘బ్యాడ్‌ యాక్టింగ్‌కు ఐశ్వర్యరాయ్‌ పర్‌ఫెక్ట్‌ ఉదహరణ. ఈ విషయాన్ని తను చాలా సార్లు రుజువు చేశారు. కేవలం తన అందమైన మొహం‍తోనే సూపర్‌ స్టార్‌ అయ్యారు. ఎలాగు ఆమె మంచి నటి కాకపోయిన అందమైన మొహం ఉంది అది చాలదా?. మంచి ఉద్యోగం, చివరకు అభిషేక్‌ బచ్చన్‌ ఆమెను తల్లిని చేయగలిగాడు’ అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత అతడు చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందిగా పలు మహిళ సంఘాలు డిమాండ్‌ చేసిన రస్సెల్‌ మాత్రం క్షమపణలు కోరనని ఖరాఖండిగా చెప్పాడు. కాగా ఈ మూవీ తను ఓ భాగం అయినందున్న అక్షయ్‌ కుమార్‌ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యలను రస్సెల్‌ తరపున క్షమపణలు కోరాడు. కాగా ప్రస్తుతం ఐశ్వర్య మణిరత్నం తాజా  సినిమా ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో విక్రమ్‌, జయం రవి, కార్తి, త్రిషతో పాటు పలువరు అగ్ర నటీనటులు భాగమవుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు