Aishwarya Rai: రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్యరాయ్‌ హొయలు

20 May, 2022 10:31 IST|Sakshi

రంగు రంగుల పువ్వులతో డిజైన్‌ చేసిన నలుపు రంగు పొడవాటి గౌనులో ఐశ్వర్యా రాయ్‌ కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై మెరిశారు. 20 ఏళ్లుగా ఈ బ్యూటీ కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇన్నేళ్లల్లో ఒకటీ రెండు సార్లు మినహా ఐష్‌ ప్రతి లుక్‌ ఆకట్టుకుంది. ఈసారి కూడా ఆమె లుక్‌కి ప్రశంసలు లభించాయి. ‘ఆల్‌ టైమ్‌ క్వీన్, బ్యూటిఫుల్, దేవత, అదుర్స్‌..’ ఇలా ఐష్‌ లుక్‌ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. భర్త అభిషేక్‌ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు ఐశ్వర్య.

ఈ ఉత్సవాల్లో తన స్నేహితురాలు, హాలీవుడ్‌ స్టార్‌ ఇవా లంగోరియాని కలిశారు ఐష్‌. ఆరాధ్యను ఇవా హత్తుకోగా, ఇవా కుమారుడు శాంటిగోని ఉద్దేశించి ‘హ్యాండ్‌సమ్‌’ అన్నారు ఐశ్వర్యా రాయ్‌. ‘‘నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ పర్సన్‌’’ అంటూ ఐశ్వర్యతో తాను దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ఇవా లంగోరియా. ఈ నెల 17న ఆరంభమైన కాన్స్‌ చలన చిత్రోత్సవాలు 28 వరకూ జరుగుతాయి.

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

చదవండి 👇

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే?

ఎన్టీఆర్‌ అభిమానులపై హైదరాబాద్‌ పోలీసులు లాఠీచార్జ్‌

మరిన్ని వార్తలు