బంజారాహిల్స్‌: టీవీ సీరియల్‌ మేనేజర్‌పై కేసు

30 Apr, 2021 14:25 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు తీసుకోకుండా సమూహాలుగా ఏర్పడి టీవీ షూటింగ్‌ను నిర్వహిస్తున్న ఘటనలో తెలుగు టీవీ ప్రొడక్షన్‌ మేనేజర్‌ కె.ప్రవీణ్‌కుమార్‌(34)పై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌  కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని సాయిబాబా టెంపుల్‌ వద్ద మంగమ్మగారి అబ్బాయి మా టీవీ తెలుగు సీరియల్‌ షూటింగ్‌ జరుగుతుండగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రవిరాజ్‌ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. సుమారుగా 18 మంది వరకు ఈ షూటింగ్‌లో పాల్గొని కోవిడ్‌–19 మార్గదర్శకాలు పాటించకుండా షూటింగ్‌ నిర్వహించారని గుర్తించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉండటంతో పాటు ఏ ఒక్కరూ కూడా మాస్క్‌లు ధరించలేదని తెలిపారు. ఈ టీవీ సీరియల్‌ మేనేజర్‌ కె.ప్రవీణ్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్‌ 188, 269, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు