యాంటీ ఇండియన్‌పై నిషేధం.. రివైజింగ్‌ కమిటీకి వెళతాం! 

11 Apr, 2021 09:58 IST|Sakshi

చెన్నై : యాంటీ ఇండియన్‌ చిత్రం కోసం రివైజింగ్‌ కమిటీకి వెళతామని ఆ చిత్ర నిర్మాత చెప్పారు. కోలీవుడ్‌లో బ్లూషర్ట్‌ మారన్‌ అంటే తెలియనివారుండరు. సినీ విశ్లేషకుడిగా ఈయన ప్రముఖ కథానాయకుడు, దర్శకుడు  పక్షపాతం చూపకుండా చిత్రాలను విమర్శ పేరుతో తనదైన బాణీలో ఏకి పారేస్తున్నారు. అలాంటి బ్లూషర్ట్‌ మారన్‌ దర్శకుడిగా అవతారమెత్తి తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం యాంటీ ఇండియన్‌.  దీనికి కథ, కథనం, మాటలు, సంగీతం కూడా బ్లూషర్ట్‌ మారన్‌నే అందించడం విశేషం. యాంటి ఇండియన్‌ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

దీంతో ఈ నెల 5వ తేదీన చిత్రాన్ని సెన్సార్‌ సభ్యులకు ప్రదర్శించారు.  యాంటీ ఇండియన్‌ చిత్రాన్ని సెన్సార్‌ సభ్యులు పూర్తిగా నిషేధించారు.  చిత్రం గురించి చిత్ర నిర్మాత స్పందిస్తూ మత సంబంధిత సమకాలిన సమస్యలు రాజకీయాలను జోడించి రూపొందించిన ఒక చక్కని సందేశంతో కూడిన యాంటీ ఇండియన్‌ చిత్రాన్ని నిషేధించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయమై తాము రివైజింగ్‌ కమిటీకి వెళ్లనున్నట్లు నిర్మాత తెలిపారు.
చదవండి: వీరప్పన్‌ డెన్‌లో నిధి ఉంది: కుమార్తె విజయలక్ష్మి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు