‘చావు కబురు చల్లగా’ ఫస్ట్‌ లుక్‌కు విశేష స్పందన

21 Sep, 2020 20:11 IST|Sakshi

టాలీవుడ్‌ యువ నటుడు కార్తికేయ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో అతడు 29వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో అటు సినీ ప్రముఖుల నుంచి, ఇటు అభిమానుల నుంచి కార్తికేయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుణ్‌ తేజ్‌, మంచు లక్ష్మీ, అనుప్‌ రూబెన్స్‌, ప్రియదర్శి, గీతా అర్ట్స్‌, బ్రహ్మజీ, లావణ్య త్రిపాఠి వంటి నటులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ రోజు కార్తికేయ తన పుట్టిన రోజుతో పాటు మరో శుభవార్తను అభిమానులకు అందించారు. (ఎన్‌ఐఏ ఆఫీసర్‌)

కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా నుంచి నేడు ఫస్ట్‌ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. హీరో కార్తికేయ పోషించిన ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్‌ లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వీడియోలో కార్తికేయ గెటప్‌, యాస, డైలాగ్‌ డెలవరి బాగుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అలాగే దీనిని చూస్తుంటే కార్తికేయ గ‌త చిత్రాలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా వుండబోతుందని అర్థమవుతోంది. (మరోసారి ప్లాస్మా దానం చేసిన కీరవాణి)

ఈ సినిమాను అల్లు అరవింద్‌ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌పై బ‌న్నీ వాసు నిర్మాతగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్‌ పెగ‌ళ్ల‌పాటి తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ నెల 21న కార్తికేయ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా గీతా ఆర్ట్స్‌ వారు కార్తికేయ ని ఏం వ‌రం కావాలో కోరుకోమని సెప్టెంబర్‌ 17న అన్నారు. దానికి కార్తికేయ నాకు టీజ‌ర్ విడుదల చేయమని అడిగాడు. దీంతో వెంట‌నే ద‌ర్శ‌కుడు స‌ర్‌ప్రైజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు  11.47 నిమిషాల‌కి విడుద‌ల చేసిన ఈ విడియో చూసిన నెటిజన్లు నిజంగా స‌ర్‌ప్రైజ్ అయ్యారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా