చావు కబురు చల్లగా: స్టెప్పులు, సెల్ఫీలు..

17 Mar, 2021 10:21 IST|Sakshi

‘చావుకబురు చల్లగా’  చిత్ర యూనిట్‌ సందడి

సాక్షి, విజయనగరం‌: ‘చావు కబురు చల్లగా...’ చిత్ర యూనిట్‌ నగరంలో మంగళవారం సందడి చేసింది. ఈ నెల 19న విడుదల కానున్న ఈచి త్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ యాత్ర లో భాగంగా వారు ఇక్కడి ఎస్వీసీ రంజనీ థియేటర్‌కు వచ్చారు. హీరో, హీరోయిన్లు కార్తికేయ, లావణ్యా త్రిపాఠి ఈ సందర్భంగా ప్రేక్షకులతో ఆడిపాడి అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన తీన్మార్‌ డప్పులకు కార్తికేయ లయబద్ధంగా స్టెప్పులేశారు. అభిమానులతో సెలీ్ఫలు దిగారు.

అనంతరం కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందనీ, ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రంతో చాలా పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఇక్కడి నుంచే వచ్చాయన్నారు. నూటికి నూరు శాతం ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోనుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి  మాట్లాడుతూ చిత్రంలో మంచి ఫీల్‌ ఉందన్నారు. ఇది ఒక  సందేశాత్మక చిత్రంగా నిలిచి పోతుందని పేర్కొన్నారు. దర్శకుడు పి.కౌశిక్‌ మాట్లాడుతూ హీరో, హీరోయిన్లు చిత్రానికి పూర్తి న్యాయం చేశారని తెలిపారు. కార్యక్రమంలో థియేటర్‌ మేనేజరు భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. 

చదవండి: 
భర్త చనిపోయిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే..

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు