చందమామ కథలోన..

12 Aug, 2023 06:13 IST|Sakshi

రక్షిత్‌ అట్లూరి, సంకీర్తన విపిన్‌ జంటగా వెంకట సత్య దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఆపరేషన్‌ రావణ్‌’. ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘చందమామ కథలోన..’ పాట లిరికల్‌ వీడియోను దర్శకుడు కె. రాఘవేంద్ర రావు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘చందమామ కథలోన.. అందమైన పిల్లేనా.. కళ్ల ముందు వాలిందా.. తుళ్లి తుళ్లి పడ్డాన..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా హరి చరణ్, గీతా మాధురి పాడారు. శరవణ వాసుదేవన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. రాధికా శరత్‌ కుమార్, చరణ్‌ రాజ్, కాంచి, రాకెట్‌ రాఘవ, రఘు కుంచె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి. 

మరిన్ని వార్తలు