ప్రముఖ ఓటీటీలోకి వచ్చేస్తున్న బెస్ట్‌ హర్రర్ తెలుగు సినిమా

17 Oct, 2023 08:51 IST|Sakshi

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘చంద్రముఖి 2’. రజనీకాంత్‌ హిట్‌ సినిమా ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్‌గా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ  సినిమా సెప్టెంబర్‌  28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రాఘవ లారెన్స్‌ భారీగానే ప్రమోషన్స్ నిర్వహించారు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన చంద్రముఖి 2 మొదటి ఆట నుంచే డివైడ్‌ టాక్‌ తెచ్చు​కుంది.

(ఇదీ చదవండి: తెలుగులో ఆ స్టార్‌ హీరోతో సినిమా ఛాన్స్‌ వస్తే చేస్తా: ఆర్కే రోజా)

దీంతో సినిమా చూద్దాం అనుకున్న వారందరూ కూడా ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అని సరిపెట్టుకున్నారు. ఈ సినిమా వల్ల సుమారు రూ. 20 కోట్ల మేరకు నిర్మాతలు నష్టపోయారని టాక్‌. తెలుగు వెర్షన్ అయితే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. 

థియేటర్‌లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కానీ  చంద్రముఖి 2 సినిమా విడుదలైన కొద్దిరోజులకే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. తమిళ వెర్షన్‌కు సంబంధించి హెచ్‌డీ ప్రింట్‌ను పైరసీ సైట్‌తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌ అయింది. థియేటర్లో చంద్రముఖి 2 చిత్రాన్ని చూడలేకపోయిన వారు అక్టోబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. కానీ ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. చంద్రముఖి 2 సినిమాలో మహిమా నంబియార్‌, లక్ష్మీ మీనన్‌, సుభీక్ష ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్‌ అందించారు.

మరిన్ని వార్తలు