మార్పు అవసరం

30 Sep, 2020 04:27 IST|Sakshi

‘‘థియేటర్, ఓటీటీ.. రెండూ వేరు అయిన ప్పటికీ ఓటీటీలో సినిమాల విడుదలను పాజిటివ్‌గా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే టెక్నాలజీ పరంగా ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడంలో ఇలాంటి మార్పులు రావడం అవసరం. వాటిని అందరూ స్వాగతించడం కూడా చాలా అవసరం’’ అన్నారు అనుష్క. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క, మాధవన్‌ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సహకారంతో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర ్భంగా అనుష్క చెప్పిన విశేషాలు.

‘భాగమతి’ చిత్రం తర్వాత కావాలని గ్యాప్‌ తీసుకున్నా. ఆ సమయంలో కోన వెంకట్‌గారు, హేమంత్‌ గారితో ‘నిశ్శబ్దం’ కథ వినిపించారు. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో పాటు సినిమా కూడా బాగుంటుందని బలంగా అనిపించి, నటించడానికి ఒప్పుకున్నాను. తొలిసారి నేను నటించిన సినిమా ఓటీటీలో విడుదలవ్వడం నాకు కాస్త కొత్తగా అనిపిస్తోంది. 

ఈ చిత్రంలో నాది చెవిటి, మూగ అమ్మాయి పాత్ర. నేను ఈ సినిమా చేయడానికి కారణం నా పాత్రకున్న ప్రత్యేకతే. ఈ పాత్ర కోసం కొన్నాళ్లు ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నాను. అయితే షూటింగ్‌కి అమెరికా వెళ్లాక అందరూ ఎక్కువగా వాడే సైన్‌ లాంగ్వేజ్‌ని అక్కడి ఓ 14 ఏళ్ల అమ్మాయి దగ్గర శిక్షణ తీసుకుని నటించాను.

మాధవన్‌గారితో నా కెరీర్‌ తొలినాళ్లలో నటించాను. మళ్లీ ఇన్నాళ్లకు నటించడం వండర్‌ఫుల్‌గా అనిపించింది. ఈ కథ కేవలం మా ఇద్దరి చుట్టూనే తిరగదు.. స్క్రీన్‌ప్లే ముందుకు నడిపించడంలో మిగతా పాత్రలు కూడా కీలకంగా మారుతుంటాయి. హేమంత్‌ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఈ ప్రయోగాత్మక కథని అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడం అంత సులువు కాదు.. దానికి చాలా ప్యాషన్,  ధైర్యం కావాలి.. ఆ రెండూ ఉన్న నిర్మాతలు విశ్వప్రసాద్, కోన వెంకట్‌గార్లు. 

థ్రిల్లర్‌ సినిమాలకి నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఓటీటీలో విడుదలవడంలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్‌ ఇదే. థియేటర్స్‌లో ఉండే సౌండ్‌ సిస్టమ్, ఆడియో క్వాలిటీని ప్రేక్షకులు మిస్‌ అవుతారు. అయితే హెడ్‌ ఫోన్స్, హోమ్‌ థియేటర్స్‌ ఈ లోపాన్ని కవర్‌ చేస్తాయి. మా సినిమాకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్స్‌ పెద్ద ఎస్సెట్స్‌. గోపీ సుందర్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఫార్వార్డ్‌ చేయకుండా ‘నిశ్శబ్దం’ సినిమాను ప్రేక్షకులంతా ఓ ఫ్లోలో చూడాలని మనవి చేస్తున్నా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా