చ‌ర‌ణ్ యాక్ష‌న్ మూవీ 'రొరి' టీజర్‌ విడుదల

3 Oct, 2022 14:01 IST|Sakshi

భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌ర్ సినిమాతో అంద‌రికి సుప‌రిచితుడైన చ‌ర‌ణ్ హీరోగా క‌రిష్మా హీరోయిన్గా చ‌ర‌ణ్ రొరి ద‌ర్శ‌క‌త్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలయ్యింది. ఫుల్‌ యాక్షన్‌ విజువల్స్‌తో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా టీజర్‌ ఆకట్టుకుంటుంది.ఈ క‌థ విష‌యానికోస్తే హైద‌రాబాద్ పోలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ఓ జ‌రిగే కుర్రాడి క‌ధ‌.

అనుకోని పరిస్థుతుల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్ ని వెళ్ళాల్సివ‌చ్చింది, అక్క‌డ కొంత‌మంది హిందువుల‌ని క‌లిసి వారి క‌ష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వ‌చ్చాడా లేదా అనేది ఈ చిత్ర క‌థ‌, అస‌లు హైద‌రాబాద్ కి , పాకిస్థాన్ కి మ‌ద్య ఏంటి సంబందం అనేది ఈచిత్రం లో ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌. త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ను విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు