పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన చార్మి

9 May, 2021 10:45 IST|Sakshi

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది అందాల భామ చార్మి. ఒకప్పుడు హీరోయిన్‌గా తన గ్లామర్‌తో యూత్‌ని అట్రాక్ట్‌ చేసిన ఈ పంజాబీ బ్యూటీ.. ఇప్పుడు నిర్మాతగా మారి వరుస విజయాలతో దూసుకెళ్తుంది.  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభిన ఆమె దాని తాలూకు అన్ని వ్యవహారాలు భుజాలపై వేసుకుంది. ఇలా కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న చార్మి  త్వరలో పెళ్లి చేసుకోతుందని ఇటీవల వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ పెళ్లి వార్తలపై చార్మి స్పందించింది. తన పెళ్లివార్తలల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్‌ అని కొట్టిపడేసింది. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది.  ‘ప్రస్తుతం కెరీర్ హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఈ లైఫ్ నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను' అని చార్మి ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా ఫేక్ రైటర్స్‌పై తనదైన శైలీలో స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. 'తప్పుడు స్టోరీలతో అట్రాక్ట్ చేస్తున్న మిమ్మల్ని అభినందించవచ్చు' వ్యగ్యంగా ట్వీట్‌ చేసింది చార్మి.  చార్మి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ తో  ‘లైగర్‌’ అనే పాన్‌ ఇండియా సినిమాను నిర్మిస్తుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌. కరణ్‌ జోహార్‌ మరో నిర్మాత. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు