భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’

4 Dec, 2021 09:27 IST|Sakshi
మంత్రి ముత్తంశెట్టితో ముచ్చటిస్తున్న డైరెక్టర్‌ వినాయక్‌

హిందీ చిత్ర షూటింగ్‌ సందడి

సాక్షి,భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి బీచ్‌లో శుక్రవారం షూటింగ్‌ సందడి నెలకొంది. తెలుగులో ప్రభాస్‌ నటించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో అదే పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్‌ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు వి.వి.వినాయక్‌ తెలిపారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తుండగా, బెల్లంకొండ సురేష్‌ నిర్మాత. హీరోయిన్‌ ముసరత్‌ బంచా, హీరో తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా ఇంకా శరత్‌ ఖేలేఖర్, రాజేష్‌శర్మ, రాంజేంద్ర గుప్తా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్‌ 10 వరకు ఇక్కడ షూటింగ్‌ నిర్వహిస్తారు.  

వినాయక్‌ను కలిసిన మంత్రి ముత్తంశెట్టి 
షూటింగ్‌లో ఉన్న దర్శకుడు వినాయక్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక్‌ తనకు మంచి మిత్రుడని తెలిపారు. స్వయం కృషితో గొప్ప దర్శకునిగా ఎదిగారని భీమిలిలో జరిగే ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్‌ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయనకు హిందీలో తొలి సినిమా అని అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుని గుర్తింపు పొందుతారని అన్నారు.

చదవండి: Allu Arjun-Priyamani: ప్రియమణిపై ‘హాట్‌’ కామెంట్స్‌ చేసిన బన్నీ

మరిన్ని వార్తలు