Samantha : రూ. 200కోట్ల భరణాన్ని సైతం రిజెక్ట్‌ చేసిన సమంత!

3 Oct, 2021 17:20 IST|Sakshi

Samantha Says No To Rs 200 Crore Alimony: సమంత-నాగ చైతన్య విడాకులకు సంబంధించి టాలీవుడ్‌లోనే కాదు, జాతీయ మీడియాలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. గత కొంతకాలం నుంచే వీరు విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో రూమర్స్‌పై ఎక్కడా స్పందించని సమంత-నాగ చైతన్య తాజాగా సోషల్‌ మీడియా వేదికగా  విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే సాధారణంగా భార్య భర్తలు విడిపోతే భర్త ఆస్తిలోనుంచి కొంత వాటా భరణంగా భార్యకు దక్కుతుంది. తాజాగా సమంతకు అక్కినేని కుటుంబం నుంచి ఎంత భరణం లభిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.

చదవండి: నెటిజన్ల ట్రోల్స్‌: సమంత-చైతన్య విడాకులకు కారణం ఇతడేనా!?

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం సమంతకు దాదాపు రూ. 200 కోట్లు ఇస్తామని అక్కినేని కుటుంబం ఆఫర్‌ చేసిందట. అయితే నాగ చైతన్య నుంచి కాని, అక్కినేని కుటుంబం నుంచి కాని ఒక్క రూపాయి కూడా తనకు వద్దని సమంత పేర్కొన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.తనకు ఎలాంటి భరణం అవసరం లేదని, సొంతంగా తాను సంపాదించుకోగలనని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఏమాయ చేశావే సినిమా టైంలోనే సమంత, నాగ చైతన్య మంచి స్నేహితులుగా మారారు. అప్పటి నుంచి సాన్నిహిత్యంగా ఉన్న వీరి స్నేహం క్రమంగా ప్రేమగా మారి 2017 అక్టోబర్‌6,7న హిందూ, క్రిస్ట్రియన్‌ సాంప్రదాయాల ప్రకారం గోవాలో వివాహం చేసుకున్నారు.

ఇప్పుడు విభేదాలు వచ్చినంత మాత్రాన ఆ బంధాన్ని భరణంతో వెలకట్టాలని సమంత అనుకోవట్లేదట. అందుకే 200కోట్లను తీసుకోవడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. 'విడాకుల వ్యవహారంతో సమంత హృదయం ముక్కలైపోయింది. ఆమె దీన్నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. కానీ తన పర్సనల్‌ లైఫ్‌ వల్ల ప్రొఫెషనల్‌ లైఫ్‌కు ఇబ్బంది రాకుండా ఆమె పనిమీద దృష్టి పెడుతుంది' అంటూ ఆమె సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


చదవండి:  హాట్‌ టాపిక్‌గా మారిన సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ పోస్టులు

మరిన్ని వార్తలు